యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌..

- March 04, 2021 , by Maagulf
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌..

తెలంగాణ:యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్‌ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మిస్తున్న టెంపుల్‌ సిటీ యాదాద్రిని నిర్మిస్తుంది. రేయింబవళ్లు సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించడం ప్రాధాన్యతనున సంతరించుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ తుదిమెరుగుల పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోలను నిర్మించనున్న స్థలాలు పరిశీలిస్తారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.

సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిశ్చయించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులతో పాటు వైటీడీఏ యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. సీఎంవో నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం, పది రోజులుగా కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానాలయంతో పాటు కొండపై మౌలిక పనులు దాదాపు పూర్తి కావస్తుండటం, మరో మూడు మాసాల్లో ఉద్ఘాటనకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉండటంతో ఆలయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.యాదాద్రి ప్రధానాలయం, పురవీధులు, శివాలయం, పుష్కరిణితో పాటు రింగురోడ్డు నిర్మాణం, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com