శ్రీశైలం:నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- March 04, 2021
శ్రీశైలం: శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబాదేవి కూడా కొలువైన శ్రీశైలంలో 14వ తేదీ వరకూ 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీశైల పట్టణమంతా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది. తొలిరోజు ఉత్సవాలకే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది.
ఈ సంవత్సరం కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. భక్తుల వసతి, వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బస్సులను మాత్రమే బస్టాండ్ లోకి అనుమతిస్తామని, కర్ణాటక, తెలంగాణ ఆర్టీసీ బస్సులకు గణేశ్ సదనానికి ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. కార్ల కోసం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం, ఘంటామఠం వెనుక భాగంలో ఏర్పాట్లు చేశామన్నారు.
ఇక నేటి ఉదయం బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా, ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ 11 రోజులూ విశేష పూజలు కొనసాగుతాయని, గ్రామోత్సవం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేశామని ఆలయ ఈఓ వెల్లడించారు. భక్తులకు విక్రయించేందుకు చాలినంత ప్రసాదాలను సిద్ధం చేశామని అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







