దాసరి చిత్రం లో విష్ణు
- February 27, 2016
మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణువర్థన్ త్వరలోనే దర్శక దిగ్గజం దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే విష్ణు కోసం కొన్ని కథలను తయారు చేశారట దాసరి. మోహన్ బాబుని ఇటీవలే కలసి ఆ కథలను వినిపించారు. వాటిలో రెండు మోహన్ బాబుకి బాగా నచ్చాయట. ఆ రెండింటిలో ఒకటి తెరకెక్కుతుంది. చాలాకాలం తరువాత ఓ యువ కథానాయకుడితో దాసరి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. యువతను ఆకట్టుకునే కథాంశం కాబట్టి విష్ణుని హీరోగా పెట్టి సినిమా తీయాలని దాసరి భావించారు. వాణిజ్య పరమైన అంశాలతోపాటూ యువతకి ఓ సందేశాన్ని కూడా ఇవ్వాలన్నది దాసరి ఆలోచన.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







