'ఏపీ స్కిల్ డెవలప్మెంట్'లో ఉద్యోగాలు..
- March 09, 2021
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. kyungshin industrial motherson pvt ltdలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఈ నెల 11లోగా రిజిస్టర్ చేయించుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లా, హిందూపూర్‌లోని సంస్థ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు రవాణా సౌకర్యంతో పాటు, ఉచిత భోజన సదుపాయం కూడా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులన్నింటికీ కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.
ప్రకటనకు సంబంధించిన వివరాలు.. Associates Special Trainees: ఈ విభాగంలో మొత్తం 200 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.8,800 వరకు వేతనం చెల్లిస్తారు. Diploma (Operator&Engineer): ఈ విభాగంలో మొత్తం 50 ఖాళీలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకునేందుకు అర్షులు. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు వయసు 18-28 ఏళ్లు ఉండాలి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









