మార్చి 12న ఎయిర్ పోర్ట్ రోడ్డు 55 మూసివేత

- March 09, 2021 , by Maagulf
మార్చి 12న ఎయిర్ పోర్ట్ రోడ్డు 55 మూసివేత

కువైట్: ఈ నెల 12న(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే ఎయిర్ పోర్టుకు వెళ్లే రోడ్డు నెంబర్ 55ను మూసివేయనున్నారు. పాదాచారులు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. క్రౌన్ ప్లాజా హోటల్ సమీపంలోని ఫర్వానియా బ్లాక్ 6 నుంచి ఖైతాన్ ఎరియాలోని బ్లాక్ 2 వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు జరగున్నాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎయిర్ పోర్ట్ రోడ్డు 55లో రెండు వైపులా వాహనాలకు అనుమతి ఉండదు. ఎయిర్ పోర్ట్ రోడ్డు 55 మీదుగా వెళ్లాల్సిన వాహనాలను సిక్త్స్ రింగ్ రోడ్డుకు మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com