పీసీఆర్ టెస్ట్ నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు
- March 09, 2021
అబుధాబి: అబుధాబిలోకి వచ్చే వాళ్లందరూ తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తో రావాలని కండీషన్ పెట్టిన ఆరోగ్య శాఖ..కొన్ని వర్గాలకు మాత్రం పీసీఆర్ టెస్ట్ షరతుల నుంచి మినహాయింపు ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్లుగా ఉన్న వారు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు, ప్రవాసీయులు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకుండానే అబుధాబికి రావొచ్చని స్పష్టం చేసింది. అలాగే నాలుగు, ఎనిమిదో రోజున కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నట్లు, క్లినికల్ ట్రయల్స్ వాలంటీర్లుగా పాల్గొన్నట్లు వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్, లెటర్ని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అబుధాబికి వచ్చే వాళ్లంతా తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ చూపించాలని ఆరోగ్య శాఖ షరతు విధించిన విషయం తెలిసిందే. అబుధాబి చేరుకునే సమయానికి 48 గంటల్లోపు జారీ చేసిన రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే పది రోజులకుపైగా అబుధాబిలోనే ఉంటే..నాలుగో రోజు, ఎనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు 24 గంటల్లోపు తీసుకున్న డీపీఐ టెస్ట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించిన అబుధాబి అధికారులు..వరుసగా రెండో సారికి మాత్రం డీపీఐ టెస్ట్ రిపోర్టును పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







