భారత్ టూ దుబాయ్ ప్రయాణికులకు ఆఫర్లే ఆఫర్లు
- March 10, 2021
యూఏఈ:భారత్ నుంచి దుబాయ్ కి ట్రావెల్ చేసే ప్యాసింజర్లకు ఆఫర్లు ప్రకటించింది ఎమిరాతి ఎయిర్ లైన్స్. ఉచితంగా హోటల్ గదితో పాటు పది కేజీల వరకు అదనంగా లగేజీ తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. అలాగే విమాన టికెట్ల ధరల్లో కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే..ఎకనామీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు వేర్వేరుగా ఆఫర్లు ఉన్నాయి. ఎకనామీ క్లాస్ టికెట్లపై ప్రయాణం చేసిన వారికి ఓ రాత్రికి హోటల్ లో ఉచితంగా బస కల్పించనున్నారు. బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్లు ఫైవ్ స్టార్ హోటల్ లో రెండు రాత్రులు ఉచితంగా బస చేయవచ్చు. టికెట్ల ధర విషయానికి వస్తే ఎకనామీ క్లాస్ టికెట్ ధరలు రూ.17,982 (Dh905), బిజినెస్ క్లాస్ రూ.68,996 (Dh3,473), ఫస్ట్ క్లాస్ రూ.1,92,555 (Dh9,700) నుంచి ప్రారంభం అవుతాయి. సాధారణంగా అనుమతించే లగేజీతో పాటు అన్ని క్లాస్ ప్రయాణికులు అదనంగా మరో 10 కేజీల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. ప్రతి ప్రయాణికుడికి మల్టి రిస్క్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మార్చి 15 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణానికిగాను..మార్చి 8 నుంచి 28 మధ్య టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







