లోయలో చిక్కుకుపోయిన 8 మంది ట్రెక్కర్లు సేఫ్

- March 12, 2021 , by Maagulf
లోయలో చిక్కుకుపోయిన 8 మంది ట్రెక్కర్లు సేఫ్

యూఏఈ: ట్రెక్కింగ్ కు వెళ్లి లోయలో చిక్కుకుపోయిన 8 మంది ట్రెక్కర్లను స్థానికుల సాయంతో సురక్షితంగా కాపాడారు అధికారులు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో స్థానిక పర్వాతారోహకులు, సివిల్ డిఫెన్స్ అథారిటీకి చెందిన పోలీసులు పాల్గొన్నారు. ట్రెక్కర్లు రస్ అల్ ఖైమా పరిధిలోని షెహా లోయలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. షెహా లోయ ట్రెక్కింగ్ కు కఠినమైనదని తెలిపారు. సమాచారం అందిన వెంటనే స్థానిక మౌంటేనర్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడగలిగామన్నారు. పర్వాతారోహకులు ట్రెక్కింగ్ వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని రస్ అల్ ఖైమా పోలీస్ మేజర్ జనరల్ సూచించారు. కఠినమైన పర్వతాలను విస్మరించటమే మంచిదని, ట్రెక్కింగ్ కు వెళ్లే ముందు స్థానికుల నుంచి తగిన సమాచారం సేకరించుకోవటం ఉత్తమమన్నారు. అలాగే ట్రెక్కింగ్ వెళ్లే బృందంలో ఎంత మంది ఉన్నారు..ఏ పర్వత ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయబోతున్నారో అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వటం ద్వారా ప్రమాద పరిస్థితుల్లో వారిని ట్రేస్ చేయటం సులభం అవుతుందని పోలీసులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com