స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతుల పున:ప్రారంభం

- March 12, 2021 , by Maagulf
స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతుల పున:ప్రారంభం

బహ్రెయిన్: కోవిడ్ సంక్షోభం తర్వాత మెల్లి మెల్లిగా సాధారణ జనజీవనం వైపు అడుగులు వేస్తున్న బహ్రెయిన్..స్కూళ్ల నిర్వహణకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 14 నుంచి విద్యార్ధులు వ్యక్తిగతంగా తరగతులకు హజరుకావొచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో తమ పిల్లలను స్కూల్స్ కి పంపించాలా..లేదంటే డిస్టెన్సింగ్ లెర్నింగ్ విధానాన్నే కొనసాగించాలా అనేది నిర్ణయించుకునే వెసులుబాటు తల్లిదండ్రులకు కల్పించింది. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడప్పుడే తమ పిల్లలను స్కూల్స్ కి పంపించలేమని భావించిన తల్లిదండ్రులు.. తమ పిల్లలకు డిస్టెన్స్ లెర్నింగ్ విధానాన్నే కొనసాగించవచ్చు. ఇదిలాఉంటే విద్యార్ధులు ప్రత్యక్ష తరగతులకు హజరుకావొచ్చని సూచించిన బహ్రెయిన్ ప్రభుత్వం..అన్ని స్కూల్స్ కోవిడ్ వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిరిగా పాటించాలని హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com