ఐసీసీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

- March 12, 2021 , by Maagulf
ఐసీసీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

ఖతార్: ఖతార్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన భారతీయ మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఐసీసీ సాంస్కృతిక కార్యకలాపాల విభాగాధిపతి శ్వేత కోస్తి, ఐసీసీ కార్యాచరణ సమన్వయం, విద్య విభాగాధిపతి కమలా ఠాకూర్ పర్యవేక్షణలో అబూ హమౌర్‌లోని ఐసిసి ప్రాంగణంలోని అశోక హాల్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై పలువురు ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యతను చాటుకుంటే ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే కరోనా సంక్షోభ సమయంలో విధులు నిర్వహించిన ఫ్రంట్ లైన్ వర్కర్లలో మహిళ సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయ పొలిటికల్ అండ్ కమర్షియల్ కౌన్సిలర్ ఏంజెలిన్ ప్రేమలత, ఖతారీ రచయితల ఫోరం డైరెక్టర్ జనరల్ మరియం యాసీన్ అల్ హమ్మడి ముఖ్య అతిథులుగా హజరయ్యారు. అలాగే ఖతార్లోని భారతీయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పార్టిసిపేట్ చేశారు. భారత ప్రభుత్వంలో అంతర్జాతీయ వ్యవహారాల మాజీ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించిన డా.ఆరతి కృష్ట తన అమూల్యమైన సందేశాన్ని వీడియో ద్వారా పంపించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పలు రంగాల్లో విజయవంతంగా రాణించిన మహిళలు..తమ అనుభవాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమలు ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసేలా ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.  కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com