ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు ప్రధాని మోదీ శ్రీకారం
- March 12, 2021
న్యూఢిల్లీ:దేశంలో 2022, ఆగస్టు 15న జరుగనున్న 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని 75 వారాలపాటు నిర్వహించతలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రామానికి ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు.ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ భారీ కార్యక్రమంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు.
అనంతరం సబర్మతి ఆశ్రమం వద్ద జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.దండియాత్ర నిర్వహించి 91 ఏండ్లు అయిన సందర్భంగా చేపట్టిన ఈ పాదయాత్ర కూడా దండి వరకు సాగనుంది. 81 మందితో ప్రారంభమై 25 రోజులపాటు 241 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుంది.మార్గమధ్యంలో వివిధ వర్గాల ప్రజలు ఈ దండి మార్చ్‌లో భాగస్వామ్యం కానున్నారు.ఈ యాత్రకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేతృత్వం వహించనున్నారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







