కరోనా పరీక్షల సంఖ్య పెంచండి:మంత్రి ఈటల..
- March 12, 2021
హైదరాబాద్:మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపద్యంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
అన్ని జిల్లాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు డా.రమేష్ రెడ్డి సచివాలయం నుండి పాల్గొనగా, ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

పక్క రాష్ట్రాలలో కరోన కేసులు పెరుగుతున్న నేపద్యంలో పలు కీలక సూచనలు చేశారు. టెస్ట్ ల సంఖ్య ను పెంచాలని సూచించారు. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా లోటు లేకుండా చూడాలని ఆదేశించారు.మహారాష్ట్ర బోర్డర్ జిల్లాలు అయిన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్,ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల DMHO లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
వాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని తెలిపిన మంత్రి, మిగిలిన గ్రూప్ వారికి కూడా త్వరలోనే వాక్సిన్ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజాలక భాగస్వామ్యం తప్పని సరి అని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







