ఆస్కార్ 2021 కు నామినేట్ అయిన వారి వివరాలు...
- March 15, 2021
ఆస్కార్ 2021 అవార్డుల కార్యక్రమానికి నామినేషన్ అయినా చిత్రాలను అలాగే ఇతర వివరాలను గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ ప్రకటించారు. అయితే దర్శకత్వ విభాగంలో మహిళలను పట్టించుకోకపోవడం పై గత ఏడాది ఆస్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ఈసారి జాగ్రత్త పడిన నిర్వాహకులు ఎంపిక జరిపారు.చోలే జావో, ఎమరాల్డ్ ఫెన్నెల్ వరుసగా నోమాడ్లాండ్ , ప్రామిసింగ్ యంగ్ వుమన్ ఉత్తమ డైరెక్టర్ స్లేట్ లో ఉన్నారు.
ఇక చాడ్విక్ బోస్మాన్ నామినేషన్ కాకుండా, ఉత్తమ నటిగా వియోలా డేవిస్ (మా రైన్స్ బ్లాక్ బాటమ్ ), ఆండ్రా డే (ది యునైటెడ్ స్టేట్స్ Vs బిల్లీ హాలిడే ), డేనియల్ కలుయుయా ( జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సీయ), లెస్లీ ఓడమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్ మయామి) నామినేషన్ లో ఉన్నారు. ఇక ఉత్తమ సహాయ నటుడిగా లేకిత్ స్టాన్ఫీల్డ్ ( జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సీయ) నామినేట్ అయ్యారు. గత సంవత్సరం క్యాన్సర్‌తో మరణించిన చాడ్విక్ బోస్మాన్ మా రైన్స్ బ్లాక్ బాటమ్ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఆ సినిమా అతని నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రియాంక, నిక్ ప్రకటించిన ఆస్కార్ నామినిస్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ చిత్రం
ఫాదర్
జుడాస్ అండ్ బ్లాక్ మెస్సీయ
మాంక్
మినారి
నోమాడ్లాండ్
ప్రామిసింగ్ యంగ్ ఉమెన్
సౌండ్ ఆఫ్ మెటల్
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7
ఉత్తమ దర్శకుడు
థామస్ వింటర్బర్గ్ (అనెదర్ రౌండ్ )
ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
డేవిడ్ ఫించర్ (మాంక్)
లీ ఐజాక్ చుంగ్ ( మినారి)
క్లోస్ జావో ( నోమాడ్లాండ్)
ఉత్తమ నటి
వియోలా డేవిస్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఆండ్రా డే ( ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే)
వెనెస్సా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్)
ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్ (నోమాడ్‌ల్యాండ్)
కారీ ముల్లిగాన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







