మార్చి 28న 'మేడ్ ఇన్ సౌదీ' ప్రారంభించనున్న సౌదీ
- March 18, 2021
సౌదీ:దేశీయ అవసరాలకు దేశీయ ఉత్పత్తులు. సౌదీ ప్రభుత్వం అవలంభించబోతున్న కొత్త విధానం ఇది. ఇప్పటివరకు చమురు ఎగుమతులనే నమ్ముకున్న సౌదీ ప్రభుత్వం..ఇక నుంచి పారిశ్రామిక రంగంలోనూ సత్తా చాటే దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. ఇందులో భాగంగా 'మేడ్ ఇన్ సౌదీ' పేరుతో కొత్త పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతోంది. దేశీయ అవసరాల కోసం దిగుమతులను తగ్గించుకోవటంతో పాటు పారిశ్రామిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడటం మేడ్ ఇన్ సౌదీ లక్ష్యం. దేశీయంగా వస్తు ఉత్పత్తులను పెంచటం ద్వారా కింగ్డమ్ లో ఉద్యోగ అవకాశాలను పెంచటం, ఆర్ధికంగా మరింత పటిష్టంగా దేశాన్ని తీర్చిద్దిద్దాలనుకుంటోంది సౌదీ ప్రభుత్వం. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి, సౌదీ ఎగుమతుల అభివృద్ధి అథారిటీ చైర్మన్ బందర్ బిన్ ఇబ్రహీం అల్ఖోరైఫ్ మార్చి 28న మేడ్ ఇన్ సౌదీ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు. కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు మేడ్ ఇన్ సౌదీ లోగోను ఆవిష్కరిస్తారు. అలాగే మేడ్ ఇన్ సౌదీ ఆవశ్యతను, ప్రొత్సహాకాలను, సుదీర్ఘ లక్ష్యాలను వివరించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







