కోవిడ్ పేషెంట్లకు సెంట్రలైజ్డ్ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం
- March 18, 2021
ఖతార్:కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు త్వరతగతిన చర్యలు చేపడుతోంది ఖతార్ ప్రభుత్వం. ఇందులో భాగంగా హోం ఐసోలేషన్ తప్పనిసరైన కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ హోమ్ ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించింది. కమ్యూనికేబుల్ డిసీజ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. కోవిడ్ ను సమర్ధవంతంగా అడ్డుకోవాలంటే వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులతో కాంటాక్ట్ కాకుండా ఉండటం ప్రధాన అంశం. అందుకోసం వారిని ఐసోలేషన్లో ఉంచటం తప్పనిసరి. అయితే..కొందరికి తమ ఇళ్లలో సరైన వసతులు ఉండవు. ప్రత్యేక గది, ప్రత్యేకంగా బాత్రూం సౌకర్యం ఉండకపోవచ్చు. అలాంటి వారికి మద్దతుగా సెంట్రలైజ్డ్ హోం ఐసోలేషన్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చు. ఇక ప్రత్యేక గది, ఇతర వసతులు ప్రత్యేకంగా ఉన్న వారు ఇంట్లోనే ఐసోలేట్ కావొచ్చని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే హోం ఐసోలేషన్ కు సిఫార్సు చేయబడిన కోవిడ్ పేషంట్లకు COVID-19 ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్పొరేషన్, సిడ్రా మెడిసిన్, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, ఐసోలేషన్ సర్వీస్ కమాండ్ సెంటర్‌తో సహా ఇతర వనరుల నుంచి అవసరమైన వైద్య సహాయాన్ని పొందవచ్చు. దీనికి అదనంగా, రోగులు 24 గంటలు వైద్యుడితో మాట్లాడటానికి సిడిసి హోమ్ ఐసోలేషన్ హాట్‌లైన్ (4025 1666) కు కాల్ చేయవచ్చని డాక్టర్ అల్ మస్లమణి వివరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







