అక్రమ వలస దారుల లక్ష్యంగా ప్రవాసీ కోటా బిల్లు..కువైట్ మంత్రి క్లారిటీ

- March 19, 2021 , by Maagulf
అక్రమ వలస దారుల లక్ష్యంగా ప్రవాసీ కోటా బిల్లు..కువైట్ మంత్రి క్లారిటీ

కువైట్:తమ ప్రభుత్వం గతేడాది ప్రతిపాదించిన ప్రవాసీ కోటా బిల్లు..కేవలం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను లక్ష్యంగా చేసుకొని రూపొందించామని కువైట్ మంత్రి వెల్లడించారు. భారత పర్యటనకు వచ్చిన కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ప్రవాసీ కోటా బిల్లు లక్ష్యాలను ఆయన వివరించారు. తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని..దాదాపు 170 దేశాల పౌరులు కువైట్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వారి వారి జాతీయత ఆధారంగా ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవటమే కువైట్ లక్ష్యం అనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అయితే..గతేడాది ప్రతిపాదించిన ప్రవాసీ కోటా ముఖ్య లక్ష్యం దేశంలోని మెజారిటీ సంఖ్యలో ఉన్న విదేశీయులను తగ్గించటమేనని తెలిసిందే. ప్రస్తుతం కువైట్లో స్థానికులు 30 శాతం ఉంటే..ప్రవాసీయులు 70 శాతం వరకు ఉన్నారు. ప్రవాసీ కోటా బిల్లు ద్వారా దేశంలో ప్రవాసీయుల సంఖ్యను 30శాతానికి తగ్గించుకోవాలన్నది బిల్లు అసలు ఉద్దేశం. ఇక భారతీయుల విషయానికి వస్తే కువైట్లో 9 లక్షల వరకు ఇండియన్లు ఉన్నట్లు కువైట్ మంత్రి వెల్లడించారు. అయితే ప్రవాసీ కోటా బిల్లు అమలులోకి వస్తే ఆ సంఖ్య 2 లక్షలకు తగ్గుతుంది. మిగిలిన వాళ్లంతా భారతదేశానికి తిరుగుప్రయాణం అవ్వాల్సి వస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com