ఇరగదీస్తున్న 'సీటీమార్' మాస్ సాంగ్

- March 21, 2021 , by Maagulf
ఇరగదీస్తున్న \'సీటీమార్\' మాస్ సాంగ్

హైదరాబాద్:గోపీచంద్, తమన్నా జంటగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీటీమార్'. ఆదివారం ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. 

మణిశర్మ సంగీత దర్శకత్వంలో పూర్తి స్థాయి మాస్ నెంబర్ గా ఆకట్టుకుంటోంది. అప్సరా రాణిపై చిత్రీకరించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్యరీతుల్ని సమకూర్చారు. 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి నేనే యాంటీ...' అంటూ సాగే ఈ పాటను... రాశారు. కీర్తన శర్మ హస్కీ వాయిస్ శ్రోతల్ని ఆకట్టుకునేలా సాగింది. 'మా అమ్మకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాను... నెలలు నిండక ముందే భూమ్మీద పడ్డాను.... బారసాల కాకముందే బోర్లా పడ్డాను... టెన్త్ లోకి రాగానే వాల్ జంప్ లే చేశాను.... ఇంటర్ లోకి రాగానే బోయ్ ఫ్రెండ్ నే మార్చాను.... డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిసేశాను... పిజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను' వంటి పదాలతో కుర్రకారుకు కిర్రెక్కించేలా ఉందీ పాట. పేటీమ్, ఏటీమ్ ఏ కార్డైనా ఓకే నా కాడ... అలసి పోయిన ఆఫీసర్లకు ఆరు దాటితే నేనేరా ఆల్కాహాల్... బడా బడా నాయకులు శీతాకాలం సమావేశాలు నాతోనే... కార్పోరేట్ లకు కేరాఫ్‌ కుర్రకారుకు వాట్సాప్... నయా బాబులకు టేక్ ఆఫ్ పెళ్ళి కొడుకులకు సెండాఫ్.... డే అయినా నైట్ అయినా బేబీ ఆలా బిజీ... గర్ల్ ఫ్రెండ్ లకు తెలియని ఏదో గరమ్ గరమ్ నరామునే తెలుసు నాకు... నీ భాగస్వాములకు పలకని ఏదో తీపి స్వరమే నాకు తెలుసు... నా భంగిమలే చూశారా ఆస్కార్ లే ఇస్తారు... నా కొలతలనే కొలిచారా సంసారులే చస్తారు యంగ్ అయినా ఏజ్ అయినా... సర్వీస్ లో ఉండదు ఏ తేడా... ఇలా అందరికీ సులువుగా అర్థమయ్యే పదాలతో రంజుగా తయారైందీ పాట. 

మణిశర్మకు మరో సూపర్ హిట్ సాంగ్ గా నిలుస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ లో పూర్తి డౌన్లో ఉన్న గోపీచంద్ కి 'సీటీమార్'లోని ఈ పాట ఎంతో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ కి ఈ పాట ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com