అన్ని కాలాలలో పచ్చదనం-హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

- March 21, 2021 , by Maagulf
అన్ని కాలాలలో పచ్చదనం-హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

నేడు అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా విమానాశ్రంలోని పచ్చదనంపై ‘అన్ని కాలాలలో పచ్చదనం – జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం’ పై ప్రత్యేక కథనం...

విమానాశ్రయాలు దేశాలకు ప్రవేశ ద్వారాల్లాంటివి. దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటి జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, 8.5 కిలోమీటర్ల ప్రధాన యాక్సెస్ రహదారి మధ్యలో ఇరువైపులా నిలబడ్డ గంభీరమైన తాటి చెట్లతో ప్రయాణికులను ఆహ్వానిస్తుంది కఠినమైన దక్కన్ పీఠభూమి లక్షణాలు కలిగిన నేలలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా అభివృద్ధి చేయబడిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దక్కన్ పీఠభూమిలోని రాళ్లు సుమారు 2,500 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవిగా భావిస్తారు.

విమానాశ్రయపు పచ్చదనం ప్రధానంగా అప్రోచ్ రోడ్, ప్రవేశం, రోటరీలు, సెంట్రల్ పార్కు చుట్లూ అల్లుకుని ఉంటుంది. మొదట గడ్డి మొక్కలు, తరువాత గరిష్టంగా 30 సెం.మీ ఎత్తుతో పచ్చని మొక్కలు, ఆ తర్వాత 1 మీటర్ల ఎత్తున్న పొదలు, తరువాత ఎత్తైన చెట్లు వస్తాయి. ఇది విమానాశ్రయం అప్రోచ్ రోడ్ మరియు విమానాశ్రయం యొక్క భవనాలకు పచ్చదనాన్ని అద్దుతుంది.

కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులు, సందర్శకులను పచ్చదనంతో పలకరించింది. విమానాశ్రయం యొక్క వినూత్న క్లౌడ్-బేస్డ్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ వల్లే ఇది సాధ్యపడింది. ఇది విమానాశ్రయం స్పైన్ రోడ్ వెంట విస్తరించి ఉన్న 80 ఎకరాల ల్యాండ్ స్కేప్‌లో మొత్తం ప్రకృతి దృశ్యాలు 90 శాతం ప్రాంతానికి ఈ సదుపాయం ఉంది. 

ప్రయాణికుల కోసం పచ్చదనం

జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌లోని పలుచోట్ల పలు రకాలకు చెందిన 15 వేలకు పైగా మొక్కలు ఉన్నాయి. వీటిని ఉక్కు, సిరామిక్, ఫైబర్ రీయిన్‌ఫోర్స్డ్‌తో తయారు చేసిన ప్లాంటర్లలో ప్రదర్శిస్తున్నారు.

RGIA లో 150 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నిలువు గార్డెన్ భారతదేశంలో ఇండోర్ వాతావరణంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి గార్డెన్. విమానాశ్రయం ఎయిర్ సైడ్‌లో బెర్ముడా రకం గడ్డిని కూడా నిర్వహిస్తున్నారు. నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట ఎత్తులో ఉండే ఈ గడ్డి, కీటకాలను దగ్గరకు చేరనివ్వదు. 

డిజైనింగ్ మరియు నిర్వహణ

350 ఎకరాలకు పైగా విమానాశ్రయ భూభాగంలోని మట్టి తక్కువ కార్బన్, నత్రజని మరియు ఫాస్పరస్‌ను కలిగి ఎర్ర కంకర మట్టి రకానికి చెందినది. అందుకని మొక్క జాతుల ఎంపికతో సహా మెరుగైన ప్రణాళిక అవసరం. ఇక్కడ నేల, మొక్కలకు సమతుల్యమైన పోషకాలు అందజేయడం అవసరం. విమానాశ్రయం మొక్కలకు ఉపయోగించడానికి విమానాశ్రయంలో ఉత్పన్నమయ్యే 2 టన్నుల ఆహార వ్యర్థాలను రోజుకు 1 టన్నుల ఎరువుగా మార్చడానికి క్యాప్టివ్ కంపోస్టింగ్ ప్లాంట్ సహాయపడుతుంది.

నిర్వహణలో సవాళ్లు

ఇంతటి విస్తారమైన మొక్కల పెంపకానికి ఖచ్చితమైన ప్రణాళిక, నిరంతర కృషి అవసరం. అందమైన ప్రకృతి దృశ్యాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి, ల్యాండ్‌స్కేప్ బృందం పట్టుదలతో చేసిన ప్రయత్నాల కారణంగా హైదరాబాద్ విమానాశ్రయం వరుసగా 8 సంవత్సరాలు ఉత్తమ ల్యాండ్‌స్కేప్‌గా గుర్తింపు పొందింది. 

తక్కువ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పొడి వాతావరణంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ కార్యక్రమాలు అవసరం. దీన్ని గుర్తించిన హైదరాబాద్ విమానాశ్రయం మొక్కల కోసం ఆటోమేటెడ్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 120 కిలోమీటర్ల పైప్ నెట్‌వర్క్, 390 కిలోమీటర్ల డ్రిప్ నెట్‌వర్క్, 72 కిలోమీటర్ల ఆటోమేషన్ కేబులింగ్, 29 నీటి వనరులు, 6,600 స్ప్రింక్లర్లు, 46 సబ్‌మెర్సిబుల్, 20 సెంట్రిఫ్యూగల్ పంపులతో కూడిన 12 సంప్‌లు రోజుకు 1800 కిలోలీటర్ల నీటిలో పంపింగ్ చేయడం నీటిపారుదల వ్యవస్థ ఇక్కడ ఉంది. లాక్‌డౌన్ సందర్భంగా వేసవిలో కూడా హైదరాబాద్ విమానాశ్రయంలో పూర్తి ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ కారణంగా మొక్కలకు నీటి లోపం ఏర్పడలేదు.

భారతదేశంలో క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఇరిగేషన్ సిస్టమ్ కంట్రోలర్‌ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. దీనిని ఏదైనా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసిన పరికరం ద్వారా నిర్వహించవచ్చు. ఇది వాతావరణం మరియు నేల తేమ పరిస్థితుల ఆధారంగా మొక్కల చివరి వరుస వరకు నీటిని వాతావరణం, నేల తేమ పరిస్థితుల ఆధారంగా పర్యవేక్షిస్తుంది.

పచ్చదనం పెంపు, పోషణ

విమానాశ్రయంలోని పచ్చదనం 2007లో నర్సరీ ఏర్పాటు నుంచి వేళ్లూనుకుంది. 13 ఏళ్ల క్రితం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అలంకార మొక్కల నర్సరీ ప్రారంభించబడింది. ఇక్కడ దేశం నలుమూలల నుండి సేకరించిన విభిన్న మొక్కల జాతులు లభ్యమవుతాయి.

ఈ నర్సరీలో ఏడు రకాల మొక్కలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ప్యాసింజర్ టెర్మినల్ భవనంలో ప్రదర్శించడానికి ఉద్దేశించిన ఇండోర్ రకం.

విత్తనాలు, మొక్కల కోసం పాలీహౌస్‌లు

హైదరాబాద్ విమానాశ్రయంలోని నర్సరీ ప్యాసింజర్ టెర్మినల్ వద్ద ఎప్పటికప్పుడు కొత్త ఇండోర్ మొక్కలను ప్రదర్శించడానికి సహాయపడుతుంది. పాలీ హౌస్‌తో కూడిన ఆధునిక నర్సరీ వల్ల విమానాశ్రయం ల్యాండ్‌స్కేప్‌కు చెట్లు, మొక్కలను సరఫరా చేయడానికి, గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి,  విమానాశ్రయ ప్రాంగణంలో రాబోయే ప్రాజెక్టులకు సహాయపడుతుంది.

విమానాశ్రయ నర్సరీలో 2,080 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక, వెంటిలేటెడ్ పాలీ హౌస్ ఉంది. ఈ పాలీ హౌస్‌లో ఏడాది పొడవునా రంగురంగుల ఆకులు, పుష్పించే మొక్కలతో అనేక రకాల ఇండోర్ మొక్కలు లభిస్తాయి. పుష్పించే మొక్కలు, అనుకూలమైన వృక్షజాలం కారణంగా, నర్సరీ వద్ద సీతాకోకచిలుకల సంఖ్య  కూడా పెరుగుతోంది. 

ప్రతి సంవత్సరం GHIALలో సుమారు 60 వేల పూల మొక్కల్ని సేకరించి, అవి పుష్పించే దశ వరకు వాటిని పెంచుతారు. దీని వల్ల మొక్కలపై వెచ్చించే దాదాపు 8 రెట్లు ఖర్చు తగ్గుతుంది.

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సాధించిన విజయాలు:

  • విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2020లో సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులకుగాను GHIAL ప్లాటినం గుర్తింపును పొందింది.
  • ఘన వ్యర్థాలను ఎరువుగా మార్చి విమానాశ్రయంలోని మొక్కలకు వేసే ప్రక్రియకు గాను GHIAL, ‘ACI’s Green Airport Award-2018-Gold Category’ ను గెలుచుకుంది.
  • GHIAL 2019లో ‘ACI’s Green Airport Award-2019-Silver Category’ ను గెలుచుకుంది.
  • పర్యావరణ నిర్వహణలో గణనీయమైన విజయాలు సాధించినందుకు ‘గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ అవార్డు 2015’ ను పొందింది.
  • మొక్కల పెంపకంలో ‘క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ కంట్రోల్ ఆఫ్ ఆటోమేటిక్ డ్రిప్/స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్‌’ను ఉపయోగించిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com