ఫేస్ మాస్క్ ధరించని 61,051 మందిపై కేసు నమోదు

- March 21, 2021 , by Maagulf
ఫేస్ మాస్క్ ధరించని 61,051 మందిపై కేసు నమోదు

బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై బహ్రెయిన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించకపోయినా, ఫేస్ మాస్కులు ధరించకపోయినా వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు బహ్రెయిన్ వ్యాప్తంగా ఫేస్ మాస్కులు పెట్టుకోని 61,051 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే భౌతిక దూరం పాటించని 8,579 మందిపై కూడా కేసులు బుక్ చేశారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించటమే ఉత్తమ మార్గమమని చెబుతున్న అధికారులు కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. ఈ నెల 18 నాటికి 7,023 అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com