ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో రశ్మిక

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో రశ్మిక

హైదరాబాద్:టాలీవుడ్ లో జోరుమీదున్న హీరోయిన్స్ లో కన్నడ కస్తూరి రశ్మిక ముందు వరుసలో ఉంటుంది.ప్రస్తుతం 'పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలతో పాటు తమిళంలో 'సుల్తాన్', బాలీవుడ్ లో మిషన్ మంజు, అమితాబ్ సినిమాలు చేస్తోంది రశ్మిక. ఇదిలా ఉంటే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తీయబోయే  సినిమాలోనూ రశ్మికనే హీరోయిన్ అనే మాట వినిపిస్తోంది.ఇటీవల రశ్మిక త్రివిక్రమ్ ను కలసి కథ కూడా విన్నట్లు సమాచారం. 'అయినను పోయి రావలె హస్తినకు' అన్నది ఈ సినిమా వర్కింగ్ టైటిల్.ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' పూర్తి కాగానే వెంటనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.అప్పటికి రశ్మిక కు కూడా 'పుష్ప' పూర్తవుతుంది.ఏ హీరోయిన్ తో నైనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటం త్రివిక్రమ్ కి అలవాటు. మరి ఎన్టీఆర్ సినిమా తర్వాత తీయబోయే సినిమాలోనూ త్రివిక్రమ్ రశ్మికనే హీరోయిన్ తీసుకుంటాడేమో చూడాలి.

Back to Top