ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో రశ్మిక
- March 21, 2021హైదరాబాద్:టాలీవుడ్ లో జోరుమీదున్న హీరోయిన్స్ లో కన్నడ కస్తూరి రశ్మిక ముందు వరుసలో ఉంటుంది.ప్రస్తుతం 'పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలతో పాటు తమిళంలో 'సుల్తాన్', బాలీవుడ్ లో మిషన్ మంజు, అమితాబ్ సినిమాలు చేస్తోంది రశ్మిక. ఇదిలా ఉంటే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలోనూ రశ్మికనే హీరోయిన్ అనే మాట వినిపిస్తోంది.ఇటీవల రశ్మిక త్రివిక్రమ్ ను కలసి కథ కూడా విన్నట్లు సమాచారం. 'అయినను పోయి రావలె హస్తినకు' అన్నది ఈ సినిమా వర్కింగ్ టైటిల్.ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' పూర్తి కాగానే వెంటనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.అప్పటికి రశ్మిక కు కూడా 'పుష్ప' పూర్తవుతుంది.ఏ హీరోయిన్ తో నైనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటం త్రివిక్రమ్ కి అలవాటు. మరి ఎన్టీఆర్ సినిమా తర్వాత తీయబోయే సినిమాలోనూ త్రివిక్రమ్ రశ్మికనే హీరోయిన్ తీసుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!