గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కవిత

- March 21, 2021 , by Maagulf
గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్:హైదరాబాద్ లో‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిసిన‌ గోలి శ్యామల.భారత్ - శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను కవిత అభినందించారు.30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా  గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు కవిత.  

ఎమ్మెల్సీ కవిత తన రోల్ మోడల్ అన్నారు గోలి శ్యామల.మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను,కవిత అన్ని విధాలుగా ప్రోత్సహించారన్న గోలి శ్యామల,తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు.అంతేకాదు కవిత కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com