గౌతమ్ మీనన్ తో మహేష్ బాబు సినిమా
- February 29, 2016
అశ్వనీదత్ మాట్లాడుతూ 'మహేష్ బాబు, గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నెక్స్ట్ మూవీ ఉంటుంది. ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అలాగే సినిమాని 2017 సమ్మర్ కానుకగా మే లో రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.ఐదేళ్ల క్రితం ఎన్టీఆర్ తో 'శక్తి'సినిమా తీసి భారీగా నష్టపోయిన అశ్వినీదత్ సినిమా నిర్మాణానికే దూరం అయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తుండటం విశేషం.ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్ లో మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళంలో తెరకెక్కే ద్విబాషా చిత్రంలో మహేష్ బాబు నటించబోతున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత గౌతమ్ మీనన్ తో మహేష్ బాబు సినిమా చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







