ఆ 13 దేశాల నుంచి వచ్చేవారికి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదన్న ఖతార్ ఎయిర్ వేస్
- March 24, 2021
దోహా: ఖతార్ ఎయిర్ వేస్, ఆర్‌టి - పిసిఆర్ టెస్ట్ విషయమై కీలక ప్రకటన చేసింది. 13 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదనీ, ఈ నిర్ణయం మార్చి 16 నుంచి అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. గతంలో ఖతార్ ఎయిర్ వేస్ తమ ప్రయాణీకులందరికీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. కాగా, ప్రభుత్వ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలు అప్పటికప్పుడు అమల్లోకి వస్తాయనీ, వాటి వివరాల్ని తమ వెబ్‌సైట్‌లో పేర్కొంటామని తెలిపింది ఖతార్ ఎయిర్ వేస్. అర్మేనియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇరాన్, ఇరాక్, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక, టాంజానియా దేశాలు ఆ 13 దేశాల జాబితాలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!