ఇండియాకి గోల్డ్ తీసుకెళ్తున్నారా?
- February 29, 2016
భారతీయులకి బంగారంతో అనుబంధం ఎక్కువ. నమ్మకమైన పెట్టుబడి మార్గం ఇది. స్టేటస్ సింబల్‌గానే కాకుండా, బంగారాన్ని అవసరమైనప్పుడు పెట్టుబడి మార్గంగానూ వినియోగించుకునే అవకాశం ఉండడంతో బంగారం పట్ల మక్కువ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు భారతదేశంలో. అయితే విదేశాల నుంచి ఇండియాకి గోల్డ్ తీసుకెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో బంగారం క్వాలిటీతో కూడుకున్నది, ధర కాస్త తక్కువ కావడంతో విదేశాల నుంచి బంగారాన్ని స్వదేశానికి తీసుకెళ్ళాలనుకుంటారు భారతీయులు. అలా తీసుకెళ్ళడానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలివి.
1. విదేశాల్లో ఏడాది కన్నా ఎక్కువ కాలం నివసించేవారు, డ్యూటీ ఫ్రీ బంగారాన్ని స్వదేశానికి తీసుకెళ్ళవచ్చు. పురుషులైతే 50,000/- విలువైన బంగారం, స్త్రీలైతే 1,00,000/- విలువైన బంగారం తమతో తీసుకు వెళ్ళవచ్చు.
2. పైన చెప్పిన విధంగానే ఏడాది కండిషన్ వర్తిస్తుంది. పిల్లలు కూడా అదే రీతిలో బంగారాన్ని తీసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
3. గోల్డ్ కాయిన్ తీసుకు వెళ్ళడానికి వీల్లేదు. బంగారాన్ని నగల రూపంలోనే తీసుకువెళ్ళాలి.
4. ఆరు నెలల కాలం విదేశాల్లో ఉన్నవారు తమతోపాటు తీసుకు వచ్చే వారు 10.3 శాతం డిస్కౌంట్ డ్యూటీ చెల్లించాలి.
5. ఆ రోజుకు ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేట్‌ని బట్టి, తీసుకెళ్ళగలిగే గోల్డ్ మొత్తాన్ని లెక్కించడం జరుగుతుంది.
6. డ్యూటీ ఫ్రీ గోల్డ్ చెల్లించి 1 కిలో వరకు గోల్డ్ తీసుకువచ్చే అవకాశం ఉంది. బంగారం లేదా నగల రూపంలో, గోల్డ్ కాయిన్, గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కూడా దీన్ని తీసుకురావచ్చు.
7. 30 రోజులు అంతకన్నా తక్కువ కాలం విదేశాల్లో ఉంటే, దాన్ని పరిగణించరు. డ్యూటీ చెల్లించి కిలో వరకు బంగారాన్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది.
8. ఆరు నెలలకన్నా తక్కువ కాలం విదేశాల్లో ఉంటే, అక్కడి నుంచి బంగారం తెచ్చుకునేటప్పుడు 36.05 శాతం డ్యూటీ చెల్లించడం తప్పదు.
9. ఇండియా నుంచి బంగారం నగల్ని తీసుకువెళ్ళేటప్పుడు దానికి తగిన ఆధారాల్ని కస్టమ్స్ డెస్క్ ద్వారా సేకరించినట్లయితే, ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా, ఇబ్బందులుండవు.
10. చిన్న చిన్న చెయిన్లు, ఇయర్ రింగ్స్ వంటి వాటిని కస్టమ్స్ పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ కస్టమ్స్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం మంచిది విదేశాలకు వెళ్ళేటప్పుడు.
11. ఫ్రీ అలవెన్స్ కేవలం స్వచ్ఛమైన బంగారు నగలకే వర్తిస్తుంది. వాటిల్లో స్టోన్స్ పొదిగినట్లయితే అది ఫ్రీ అలవెన్స్ కిందకి రాదు.
12. డ్యూటీ ఫ్రీ అలవెన్స్ దాటి బంగారం తీసుకువెళ్ళినా, కస్టమ్స్ నుంచి ఇబ్బందులు తప్పవు, అరెస్ట్ అవడం, జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.
13. కాంట్రాక్ట్ ముగించుకుని వచ్చాక గోల్డ్ విషయంలో ఎలాంటి స్పెషల్ అలవెన్స్‌లు ఉండవు.
14. ప్రయాణీకుడు తనతోపాటు గోల్డ్ తీసుకువెళ్ళవచ్చు లేదంటే పదిహేను రోజుల్లోగా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అనుమతించబడిన మొత్తానికి గోల్డ్‌ను కస్టమ్స్ నుంచి తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









