కోవిడ్ కేర్ హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం..
- March 26, 2021
ముంబై:ముంబైలోని బాండూప్ ప్రాంతంలోని కరోనా ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా ఆసుపత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు.
కాగా, ముంబైలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో అధికారులు ఇటీవల షాపింగ్ మాల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చారు. షాపింగ్ మాల్‌లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







