కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి
- April 04, 2021
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో టీకా తీసుకున్నారు. గత నెల 1న తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి డోసు వేయించుకున్నారు. దేశంలో మార్చి 1న రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7,59,79,651 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి విడుత వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి విడుతలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు, అనంతరం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







