గల్ఫ్ సంఘాల ప్రతినిధుల కేరళ పర్యటన
- April 04, 2021
కేరళలో పర్యటించిన అధికారుల బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... గల్ఫ్ ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం కేరళలో పర్యటించనున్నట్లు గల్ఫ్ జెఏసి నాయకులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 8,9,10 మూడు రోజుల పాటు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తమ బృందం నోర్కా, ఒడెపెక్, ప్రవాసి వెల్ఫేర్ బోర్డు లాంటి సంస్థల కార్యాలయాలను సందర్శిస్తామని ప్రభుత్వ అధికారులను, కార్మిక సంఘాలను, నిపుణులను కలుస్తామని స్వదేశ్ తెలిపారు. గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన వలస కార్మికుల పునరావాస కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. కేరళ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ఒక నివేదికను తయారుచేసి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







