టెక్నో సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో రక్షా ఒప్పందం

- April 08, 2021 , by Maagulf
టెక్నో సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో రక్షా ఒప్పందం

హైదరాబాద్: సెక్యూరిటీ సర్వీసెస్ రంగంలో పేరెన్నికగన్న జీఎంఆర్ గ్రూప్ కంపెనీ అయిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ - యుకె, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ సంస్థలతో చేతులు కలపడం ద్వారా టెక్నో-సెక్యూరిటీ రంగంలో తమ బలాన్ని పెంచుకుంటున్నట్లు, ప్రపంచంలోని అత్యాధునిక టెక్నో సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను భారతదేశానికి తెస్తున్నట్లు ప్రకటించింది. 

ISO 9001: 2015, ISO 18788: 2015, ISO 29993: 2017 మరియు ISO 45001: 2018 సర్టిఫికేషన్లు కలిగిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్, GMR గ్రూప్ అసెట్స్ మరియు అనేక కార్పొరేట్ సంస్థలకు భద్రతా సేవలను అందిస్తోంది. రక్షా ట్రైనింగ్ అకాడమీ, దానిలో అందించే సాటిలేని శిక్షణ కారణంగా, అది అందించే భద్రతా సేవలు ఇతర సంస్థలు అందించే సేవలకన్నా ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటాయి. 

మనుషుల ద్వారా రక్షణ అందించడంలో ముందున్న రక్షా - యాక్సెస్ కంట్రోల్, సీసీటీవీ నిఘా, ఫైర్ అలారం & పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, చొరబాట్లను గుర్తించే వ్యవస్థ, విధ్వంస నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక చర్యలు, కమాండ్ & కంట్రోల్ సెంటర్లు మొదలైన సేవలు, పరికరాల విషయంలో ఇప్పటికే పేరెన్నిక పొందింది.

తమ ఖాతాదారులకు కొన్ని ప్రత్యేకమైన, అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించడానికి రక్షా ఇటీవల ఇస్రాయెల్‌కు చెందిన ఆక్టోపస్, ఫ్రాన్స్‌కు చెందిన ఎక్సావిజన్, యూకేకు చెందిన వెస్ట్ మినిస్టర్ గ్రూప్ మరియు లాజికల్లీ లాంటి అంతర్జాతీయ ప్రశంసలు పొందిన నాలుగు టెక్నో సెక్యూరిటీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇజ్రాయెల్ సంస్థ ఆక్టోపస్‌తో ఒప్పందం వల్ల రక్షాకు అత్యవసర పరిస్థితులలో స్మార్ట్ సిటీలు, ఎయిర్‌పోర్టులు, టౌన్ షిప్పులులాంటి చోట్ల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ ఏర్పాటులో నైపుణ్యం లభిస్తుంది. ఫ్రెంచ్ సంస్థ ఎక్సివిజన్‌తో ఒప్పందంతో రక్షాకు మెకాట్రానిక్, ఆప్టో-ఫోటోనిక్, ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటూ దీర్ఘకాలిక సొల్యూషన్స్ అమలు చేసే సామర్థ్యం లభిస్తుంది.50కి పైగా దేశాల్లోని కార్యాలయాలు కలిగిన యుకేకు చెందిన వెస్ట్‌మినిస్టర్ గ్రూపుతో ఒప్పందంతో రక్షా అత్యాధునిక టెక్నాలజీ సెక్యూరిటీ పరిష్కారాలు అందించగలుగుతుంది.కృత్రిమ మేధ ఆధారిత సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించడానికి వీలుగా రక్షా, UKకు చెందిన లాజికల్లీ సంస్థతో చేతులు కలిపింది. లాజికల్లీ సంస్థ ఆన్‌లైన్, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం, హానికరమైన కంటెంట్‌ను ఎదుర్కోవటానికి అత్యాధునిక AI సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తుంది.

ఈ ఒప్పందాలపై జీయుజీ శాస్త్రి, సీఈఓ-రక్షా మాట్లాడుతూ “రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ అనేక సంవత్సరాలుగా భద్రతా సేవల రంగంలో ముందుంటూ, దేశంలోని అనేకమంది ప్రముఖ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. తన ఖాతాదారులకు ప్రపంచస్థాయి కృత్రిమ మేధ ఆధారిత  టెక్నో భద్రతా పరిష్కారాలను అందించడానికి UK, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ ఆధారిత సంస్థలతో ఒప్పందం ఏర్పురుచుకుంది. మొట్టమొదటిసారిగా క్లయింట్ల కోసం కొన్ని ప్రత్యేకమైన, సెక్యూరిటీ సొల్యూషన్స్ మేము అందించబోతున్నాము. ” అన్నారు.

టెక్నో సెక్యూరిటీ, గార్డింగ్ సొల్యూషన్స్ అందించడంతో పాటు రక్షా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, ఫైర్ సర్వీసెస్ మరియు అనంతపూర్‌లోని అత్యాధునిక అకాడమీలో  సెక్యూరిటీ అండ్ సేఫ్టీలో ఉన్నత స్థాయి శిక్షణను అందిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com