ప్రవాసీయుల కుటుంబాలకు క్వారంటైన్ నుంచి మినహాయింపు
April 08, 2021
ఒమన్: విదేశాల నుంచి తిరిగి వచ్చే పౌరులు, ప్రవాసీయులకు క్వారంటైన్ నుంచి ఊరటనిచ్చింది ఒమన్ ప్రభుత్వం.హోటల్స్ ఇతర ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే ప్రవాసీయుల కుటుంబాల్లోని సంతానం 18 ఏళ్లు అంతకన్న తక్కువ ఉంటే క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే...డొమస్టిక్ క్వారంటైన్ లో ఉంటామంటూ హామీ ఇచ్చిన వారికే ఈ మినహాయింపు ఉంటుంది. గతంలో ఒమన్ పౌరులకు మాత్రమే ఈ మినహాయింపు ఉండగా..ఇప్పుడు ప్రవాసీయులకు కూడా వర్తించనుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)