రెస్టారెంట్లు, కేఫ్ ల‌పై ఆంక్ష‌ల కొన‌సాగింపు

- April 09, 2021 , by Maagulf
రెస్టారెంట్లు, కేఫ్ ల‌పై ఆంక్ష‌ల కొన‌సాగింపు

ఒమ‌న్: క‌ర్ఫ్యూ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు పాక్షిక క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించిన ఒమ‌న్...కోవిడ్ ఆంక్ష‌ల‌ను మ‌రికొంత కాలం పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. రెస్టారెంట్లు, కేఫ్ లు య‌థావిధిగా రాత్రి 8 గంట‌ల‌కే మూసివేయాల‌ని క్లారిటీ ఇచ్చింది. అయితే...పాక్షిక క‌ర్ఫ్యూ నుంచి పాద‌చారుల‌కు, వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌నిచ్చిన విష‌యం తెలిసిందే. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో వాహ‌నాల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు సుప్రీం క‌మిటీ తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి ర‌మదాన్ తొలి రోజు వ‌ర‌కు ఇవే నిబంధ‌న‌లు అమ‌లులో ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత అనుస‌రించాల్సిన విధానాల‌పై త‌దుప‌రి స‌మాచారం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమ‌న్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com