భారత్ లోని ముస్లిం సోదరులకు 4 టన్నుల ఖర్జూరాల కానుక
- April 09, 2021
సౌదీ: ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలాలైన మక్కా, మదీనా మసీదుల తరపున భారత్ లోని ముస్లిం సోదరులకు ఖర్జూరాలను కానుకగా పంపించారు కింగ్ సల్మాన్.ఢిల్లీలోని సౌదీ అరేబియా కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ముస్లిం సంస్థలు గిఫ్ట్ ప్యాక్ లను పలువురికి అందిస్తున్నారు.దేశంలోని పలు ముస్లిం ప్రముఖులకు, ఇస్లాం సంస్థలకు ఖర్చూర ప్యాకెట్లను పంపిస్తున్నారు.అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సౌదీ సంఘీభావంగా ఉంటుందనే సందేశాన్ని చేరవేస్తూ ప్రపంచంలోని దాదాపు 24 దేశాలకు సౌదీ గిఫ్ట్ ప్యాక్ లను పంపిస్తోంది. అదే తరహాలో భారత్ కు కూడా 4 టన్నుల ఖర్జూరాలను గిఫ్ట్ గా పంపించింది.ముస్లిం సోదరులకు కష్టానష్టాల్లో తాము అండగా ఉంటామనే సందేశాన్ని పంపించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







