'ఖిలాడీ' టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు
- April 09, 2021
హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ 67వ చిత్రం "ఖిలాడీ". 'రాక్షసుడు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 12న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు 'ఖిలాడీ' టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఖిలాడీ' ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... టీజర్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు రవితేజ అభిమానులు. కాగా రవితేజ ఈ ఏడాది 'క్రాక్' చిత్రంతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అదే జోష్ లో 'ఖిలాడీ' చిత్రంలో నటిస్తున్నారు మాస్ మహారాజ.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







