'మేజర్' నుంచి శోభితా ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ విడుదల
- April 09, 2021
హైదరాబాద్: యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ 'మేజర్'.హీరో అడవి శేష్ సరసన శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రమోద అనే పాత్రలో శోభిత నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. 'మేజర్' చిత్రంలో జులై 2న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







