జార్జియాలో విజయ్ 65వ చిత్రం షూటింగ్ ప్రారంభం
- April 09, 2021
జార్జియా: తమిళ స్టార్ హీరో, తలపతి విజయ్ 65వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.పూజా హెగ్డేకు కోలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం.విజయ్ తమ 65 చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. ఇప్పటికే విజయ్ జార్జియా ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... తాజాగా జార్జియాలో షూటింగ్ స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు విజయ్ కు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు 'తలపతి65' టీం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై 'తలపతి65' చిత్రం భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. కాగా విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం ఈ ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన 'మాస్టర్' తమిళంలో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







