మరో అరుదైన గౌరవం అందుకున్న సోనూసూద్..

- April 11, 2021 , by Maagulf
మరో అరుదైన గౌరవం అందుకున్న సోనూసూద్..

పంజాబ్: భారత దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు సోనూ సూద్. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వెలది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆడుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు సోనూ సూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్ ను నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్ ను నియమించినట్టు అయన తెలిపారు.గొప్ప పరోపకారి, నటుడు సోనూ సూద్‌ని కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన మద్దతుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలి అని పంజాబ్ సీఎం ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవడంతో పంజాబీలు అయిష్టంగా ఉన్నారని చెప్పిన ముఖ్యమంత్రి.. తమ ప్రజలను వ్యాక్సిన్ వేసుకునేలా సోనూ సూద్ ప్రభావితం చేయగలరని ఆకాంక్షించారు. కరోనా సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంతూళ్లకు పంపడంలో సోనూ సూద్ సేవలను ఆయన ప్రశంసించారు. సోనూ సూద్ సీఎం అమరీందర్‌ను కలిసిన మరుసటి రోజే బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం విశేషం. సోనూ సూద్‌ స్వస్థలం పంజాబ్‌లోని మోగా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com