సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం..

- April 11, 2021 , by Maagulf
సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం..

చెన్నై: SRH-KKR మధ్య ఈరోజు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ నితీష్ రానా(80), రాహుల్ త్రిపాఠి(53) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ కు మొదట్లోనే షాక్ తగ్గిలింది. ఇద్దరు ఓపెనర్లు వరుస ఓవర్లలో పెవిలియన్ కు చేరిన తర్వాత మూడో మూడో వికెట్ కు 92 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ చేసిన బెయిర్‌స్టో ఔట్ కావడంతో మళ్ళీ కష్టాలో పడిపోయింది జట్టు. ఆ తర్వాత  వరుస వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయడంతో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఔట్ కాకుండా నిలిచిన మనీష్ పాండే అర్ధశతకం కూడా విఫలమైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com