జి.డి.ఆర్.ఎఫ్.ఎ కొత్త బిల్డింగ్ ప్రారంభించిన షార్జా రూలర్
- April 12, 2021
షార్జా: డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జి.డి.ఆర్.ఎఫ్.ఎ.) కొత్త భవనం షార్జాలో ప్రారంభమైంది. ముజైరా, అల్ రహమానియాలో ఈ భవనాన్ని డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి (సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా రూలర్) ప్రారంభించారు. 100 కౌంటర్లతో కూడిన ఈ భవనం, వినియోగదారులకు వేగవంతమైన సేవల్ని అందించనుంది. రెసిడెన్సీ మరియు ఐడెంటిటీ కార్డుల జారీ వంటి సేవలు ఇక్కడ లభ్యమవుతాయి. ఈవెంట్లు, కాన్ఫరెన్సులు, లెక్చర్లు ఇతర యాక్టివిటీలకు సంబంధించి 385 మంది సామర్థ్యంతో బిల్డింగులో థియేటర్ సౌకర్యం కూడా వుంది. 170 మంది వర్షిపర్స్ కోసం మసీదు కూడా ఇందులో ఏర్పాటు చేశారు. వర్కింగ్ మదర్స్ కోసం నర్సరీ ఏర్పాటు చేశారు. జిమ్నాజియం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో నడిచే క్లినిక్ కూడా వున్నాయి.
తాజా వార్తలు
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్









