పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రం
- April 12, 2021
దోహా: ఏప్రిల్ 12న పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభమువుతోంది. మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి దోహా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ కేంద్రాన్ని సందర్శించారు.ఇంతకు ముందున్న మెడికల్ కమిషన్ ఫెసిలిటీ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ఖతార్ ఛారిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, కొనొకో ఫిలిప్స్ - ఖతార్ సహకారమందిస్తాయి. ఈ కేంద్రం ద్వారా కోవిడ్ 19పై పోరులో మరో కీలకమైన ముందడుగు వేసినట్లవుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. మొత్తం 35 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇప్పటికే ఖతార్ లో అందుబాటులో వున్నాయి. ఇప్పటిదాకా 1,079,000 మందికి వ్యాక్సిన్లను అందించారు. కాగా, కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం వారంలో ఆరు రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









