చాలాకాలంగా రోడ్ సైడ్ పార్క్ చేసిన 24 కార్ల స్వాధీనం
- April 15, 2021
కువైట్ సిటీ: రోడ్డుకు ఇరువైపుల, పార్కింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయవద్దని అధికారులు ఎంతగా చెప్పినా కొందరు పెడచెవిన పెడుతున్నారు.రోడ్డు పక్కల చాలా కాలంగా పార్క్ చేసిన వాహనాలతో సిటీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని...వాటిని వెంటనే తొలగించాలని ఓనర్లకు సూచించినా పట్టించుకోవటం లేదు. దీంతో ఫార్వానియా గవర్నరేట్లోని అరియా ప్రాంతాల్లో కొంతకాలంగా పార్క్ చేసి ఉన్న 24 వాహనాలను మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రోడ్ వర్క్స్ , పబ్లిక్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టారు. పార్క్ చేసిన వాహనాలను వాటి ఓనర్లు అలాగే వదిలివేయటంతో తమకు ఇబ్బందిగా మారిందని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావటంతో మున్సిపాలిటీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







