ఏపీలో కరోనా కేసుల వివరాలు

- April 15, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,42,135 కు చేరింది.ఇందులో 9,03,072 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,710 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 14 మంది మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,353 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,745 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 35,741 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com