పర్యాటకులకు అందుబాటులో అత్యాధునిక పడవల సేవలు
- March 02, 2016
ప్రధాన పర్యాటక ప్రాంతమైన హుస్సేన్‌సాగర్‌లో విహరించాలనుకునే పర్యాటకులకు అత్యాధునిక పడవల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పడవలను టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం ప్రారంభించారు. ఒక పడవలో పయనించి సానియా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పేర్వారం రాములు, ఎండీ క్రిష్టినా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదీని కావడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణలో చాలా పట్టణాలు తమకు తెలియవని, వాటన్నిటినీ చూడాలనుకుంటున్నానని, హైదరాబాద్‌లో భిన్న సంస్కృతి కనిపిస్తుందని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







