గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన కోవిడ్ మృతుల సంఖ్య
- April 16, 2021
ఒమన్: ఒమన్ లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు.గతేడాది అక్టోబర్ 27 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యల మరణాలు నమోదు చేసుకోవటం ఇదే తొలిసారి.ఇదిలాఉంటే గత 24 గంటల్లో సుల్తానేట్ పరిధిలో 1,035 మంది కోవిడ్ బారిన పడ్డారని, వైరస్ కారణంగా 103 మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 267 మంది ఐసీయూలో చేరారని, దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 786కు పెరిగిందని వివరించింది. మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ఇప్పటివరకు ఐసీయూలో ఇంత పెద్ద సంఖ్యలో చేరటం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







