లాస్ట్ జర్నీ అంబులెన్సును ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

- April 18, 2021 , by Maagulf
లాస్ట్ జర్నీ అంబులెన్సును ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: కరోనాతో మరణించిన శవాలను తరలించడానికి ఫీడ్ ద నీడ్ స్వచ్చంద సంస్థ సహకారంతో లాస్ట్ జర్నీ అంబులెన్సును రాచకొండ పోలీస్ కమిషనేర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ అంబులెన్సు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సేవలు అందిస్తుందని కమీషనర్ తెలియజేసారు.దీని సేవలు కావాల్సిన వారు రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ 9490617234,7995404040 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలియజేసారు.

ఈ సేవను నిర్వహిస్తున్న ఫీడ్ ద నీడ్ ఎన్జీవో యొక్క కృషిని అయన ప్రశంసించారు.మొదటి వేవ్ సమయంలో, ఈ సేవ ద్వారా 210 దహన సంస్కారాలు జరిగాయని, అందులో 160 కోవిడ్ అని అయన పేర్కొన్నారు. 10 మంది టెక్కీల బృందాన్ని అయన ప్రశంసించారు.సీపీ రాచకొండ వాహనం ఉప్పల్ పీఎస్ వద్ద నిలబడుతుందని, దురదృష్టకర పరిస్థితిలో ఎవరికైన సేవ అవసరమైతే,రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ కు 9490617234 కాల్ చేయవచ్చు లేదా 7995404040 ఫీడ్ ద నీడ్ నెంబర్ కు కాల్ చేయవచ్చన్నారు.

సోషల్ డిస్టెన్సిన్గ్ (సామజిక దూరం) వంటి అన్ని కోవిడ్ ప్రోటోకాల్ ని అనుసరించాలని ప్రజలకు కమీషనర్ సూచించారు.మాస్కులు ధరించడం,చేతులు శుభ్రపరచడం మరియు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com