శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్..
- April 18, 2021
తిరుమల: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాగా, కరోనా వైరస్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి దర్శనంపైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.మే 1వ తేదీ నుంచి రూ.300 దర్శన టికెట్లను 15 వేలు మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన టీటీడీ.. సదరు ప్రకటనను అధికారిక వెబ్సైట్లోనూ పొందుపరిచింది. ఇప్పటికే సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం రోజుకు 30వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. తాజాగా నిర్ణయంతో మే 1వ తేదీ నుంచి 15వేల మందికి మాత్రమే శ్రీవారికి దర్శనం కల్పించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో టీటీడీలోనూ పలువురు వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితులు గతేడాదికన్నా భయానకంగా ఉండటంతో టీటీడీ బోర్డు యాజమాన్యం అప్రమత్తమైంది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను భారీగా కుదించారు. కరోనా పరిస్థితులు గమనిస్తుంటే.. ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. దాంతో సాధారణ పరిస్థితి వచ్చే వరకు రోజుకు 15 వేల మందికి మాత్రమే తిరుమలేశుడి దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది.
కాగా,గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంటా తిరుమలలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత పరిస్థితులు కుదిటపడటంతో కొద్ది కొద్దిగా భక్తుల దర్శనాలను పెంచుకుంటూ వచ్చారు. తొలుత రోజుకు 3వేల మంది భక్తుల చొప్పున శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు రోజుకు 30 వేల మంది వరకు భక్తులు తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. మళ్లీ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుండటంతో తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







