లాస్ట్ జర్నీ అంబులెన్సును ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్
- April 18, 2021
హైదరాబాద్: కరోనాతో మరణించిన శవాలను తరలించడానికి ఫీడ్ ద నీడ్ స్వచ్చంద సంస్థ సహకారంతో లాస్ట్ జర్నీ అంబులెన్సును రాచకొండ పోలీస్ కమిషనేర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ అంబులెన్సు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సేవలు అందిస్తుందని కమీషనర్ తెలియజేసారు.దీని సేవలు కావాల్సిన వారు రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ 9490617234,7995404040 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలియజేసారు.

ఈ సేవను నిర్వహిస్తున్న ఫీడ్ ద నీడ్ ఎన్జీవో యొక్క కృషిని అయన ప్రశంసించారు.మొదటి వేవ్ సమయంలో, ఈ సేవ ద్వారా 210 దహన సంస్కారాలు జరిగాయని, అందులో 160 కోవిడ్ అని అయన పేర్కొన్నారు. 10 మంది టెక్కీల బృందాన్ని అయన ప్రశంసించారు.సీపీ రాచకొండ వాహనం ఉప్పల్ పీఎస్ వద్ద నిలబడుతుందని, దురదృష్టకర పరిస్థితిలో ఎవరికైన సేవ అవసరమైతే,రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ కు 9490617234 కాల్ చేయవచ్చు లేదా 7995404040 ఫీడ్ ద నీడ్ నెంబర్ కు కాల్ చేయవచ్చన్నారు.

సోషల్ డిస్టెన్సిన్గ్ (సామజిక దూరం) వంటి అన్ని కోవిడ్ ప్రోటోకాల్ ని అనుసరించాలని ప్రజలకు కమీషనర్ సూచించారు.మాస్కులు ధరించడం,చేతులు శుభ్రపరచడం మరియు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







