క్షీణించిన వైఎస్ షర్మిల ఆరోగ్యం..

- April 18, 2021 , by Maagulf
క్షీణించిన వైఎస్ షర్మిల ఆరోగ్యం..

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు.అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు.  అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు.ప్రస్తుతం ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు.అయితే తాజాగా వైద్యులు షర్మిల ఆరోగ్యాన్ని పరీక్షించారు. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా షర్మిల ఆరోగ్యంపై డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. షర్మిల ఆరోగ్యం క్షిణిస్తోందని పేర్కొన్నారు.షర్మిల షుగర్ లెవెల్స్ 88 నుంచి 62 కు తగ్గాయని వెల్లడించారు. అంతేకాదు షర్మిల ఏకంగా రెండు కిలోల బరువు తగ్గారని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆమె బిపి కూడా కంట్రోల్ తప్పిందని ఆయన పేర్కొన్నారు.కాగా ఇవాళ మధ్యాహ్నం లోపు ఆమె దీక్ష విరమించుతారని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com