రెసిపిరేట‌ర్స్ కొర‌త ప్ర‌చారాల‌ను కొట్టిపారేసిన ఒమ‌న్‌

- April 18, 2021 , by Maagulf
రెసిపిరేట‌ర్స్ కొర‌త ప్ర‌చారాల‌ను కొట్టిపారేసిన ఒమ‌న్‌

ఒమ‌న్‌: ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కోవిడ్ పేషెంట్ల‌కు అందించే రెసిపిరేట‌ర్స్ కు కొర‌త ఏర్ప‌డింద‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఒమ‌న్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. పేషెంట్ల‌కు కావాల్సిన స్థాయిలో రెసిపిరేట‌ర్స్ ఉన్నాయ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చింది. స‌లాలలోని క‌బూస్ ఆస్ప‌త్రిలో రెసిపిరేట‌ర్స్ కొర‌త ఉందంటూ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుత‌న్న నేప‌థ్యంలో ఆరోగ్య శాఖ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు పేషెంట్ల‌కు త‌గిన చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, ఆస్ప‌త్రుల్లో అందుకు కావాల్సిన వ‌స‌తుల‌ను పెంచామ‌ని కూడా వివ‌రించింది. ప్ర‌జ‌లు ఎవ‌రూ ఊహాగానాల‌ను విశ్వ‌సించొద్ద‌ని, సంబంధిత శాఖ నుంచి కావాల్సిన స‌మాచారాన్ని పొందాల‌ని సూచించింది. ఎవ‌రైనా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే వారిపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ‌
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com