భారత్ రైల్వే వెబ్ సైట్ హ్యాక్
- March 02, 2016
భారత రైల్వేకి చెందిన ఓ వెబ్ సైట్ ను అల్ ఖైదా ఉగ్రవాదులు హ్యాక్ చేశారు. భారత రైల్వే శాఖ మీద ఉగ్రవాదుల కన్ను పడటంతో అధికారులు హడలి పోయారు. సెంట్రల్ జోన్ పరిధిలోని మహారాష్ర్టలోని భుసావల్ డివిజన్ కు చెందిన వెబ్ సైట్ ను అల్ ఖైదా ఉగ్రవాదులు హ్యాక్ చేశారని అధికారులు చెప్పారు.
విషయం తెలుసుకున్న భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల నుంచి భారత రైల్వేకి తొలిసారి ఇలాంటి పరిణామం ఎదురుకావడంతో ఆ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే శాఖ వెబ్ సైట్ హ్యాకింగ్ ద్వారా దేశ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.వెబ్ సైట్ హ్యాక్ చేసిన అల్ ఖైదా ఉగ్రవాదులు 11 పేజీల సందేశాన్ని అదే వెబ్ సైట్ లో పెట్టారు. ఉగ్రవాద నేత ఆసీమ్ ఉమర్ పేరుతో ఆ సందేశం ఉంది. అందులో భారత్ ముస్లీంలు జిహాద్ పాఠాలు మరిచిపోతున్నారని, వారికి మళ్లీ ఆ పాఠాలు నేర్పించి యుద్దరంగానికి కదిలేలా చేస్తామని హెచ్చరించారు.ప్రజలు జిహాద్ లో పాల్గోనేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలను ఓడించడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ రైల్వేలో 115 రైల్వే స్టేషన్లు ఉన్న భూసావల్ డివిజన్ వెబ్ సైట్ కు ట్రాఫిక్ ఎక్కువే అని అధికారులు అంటున్నారు. ఈ డివిజన్ పరిధిలో ముస్లీం జనాభా ఎక్కువగానే ఉందని అధికారులు అంటున్నారు.ఈ నేపధ్యంలోనే తమ భావజాల విస్తరణకు అల్ ఖైదా ఈ చర్యకు పూనుకుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆసీమ్ ఉమర్(సనౌల్ హక్) దక్షిణాసియా విభాగానికి చీఫ్ గా పని చేసేవాడు. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అతను అల్ ఖైదాలో చేరాడు. 1995 నుంచి అతను మాయం అయ్యాడని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







