క్వారంటైన్ హోటల్స్: డిస్కవర్ ఖతార్ బుకింగ్స్ ప్రారంభం
- April 28, 2021
దోహా: బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంక దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 10 రోజుల తప్పనిసరి హోటల్ క్వారంటైన్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది డిస్కవర్ ఖతార్. మొత్తం 45 ప్యాకేజీలను 3, 4 మరియు 5 స్టార్ హోటల్ అకామడేషన్ కోసం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 3,500 ఖతారీ రియాల్స్ నుంచి 8,500 ఖతారీ రియాల్స్ వరకు ప్యాకేజీలు వుంటాయి. పైన పేర్కొన్న దేశాల నుంచి రానివారికి ఈ హోటళ్ళలో అవకాశం వుండదు. ఏప్రిల్ 26 నుంచి ప్రయాణీకులంతా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ కలిగి వుండాలి. కాగా, వ్యాక్సినేషన్ పొందినవారికీ, గతంలో కరోనా సోకినవారికి ఎలాంటి మినహాయింపులు వుండవు. కాగా, ఏప్రిల్ 28వ తేదీ కంటే ముందు బుక్ చేసుకున్నవారికి డిస్కవరీ ఖతార్ వోచర్లు వర్తిస్తాయి. కాగా, ఏప్రిల్ 29 తర్వాత వచ్చేవారు, అప్పటికే బుకింగ్ చేసుకుని వుంటే, వారిని సంప్రదించి, ఒరిజినల్ బుకింగ్ క్యాన్సిల్ అయిన విషయాన్ని తెలియజేస్తారు. తిరిగి వారు హోటల్ బుకింగ్ కొత్తగా చేసుకోవాల్సి వుంటుంది. 27 ఏప్రిల్ తర్వాత బుక్ చేసుకున్నవారికి 100 శాతం క్యాన్సిలేషన్ ఫీజు వర్తిస్తుంది. పైన పేర్కొన్న దేశాల నుంచి ట్రాన్సిటింగ్ చేయనివారికి చెకిన్ కోసం అనుమతించరు. రిఫండ్ కూడా ఇలాంటివారికి వర్తించదు.
--రాజ్ కుమార్ వనం బత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







